తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిన్నది : కవిత

K. Kavitha
K. Kavitha

హైదరాబాద్‌  ప్రభాతవార్త : కాంగ్రెస్ నేత మధుయాష్కీకి ఎంపీ కవిత లీగల్‌ నోటీసులిచ్చారు. తనను తనను
కేసీఆర్ కుటుంబంపై మధుయాష్కి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అమరుల శవాలపై బిర్యానీ తింటూ రాజకీయాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. సోలార్‌, గ్రానైట్‌, అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ వ్యాపారులతో కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. బెంగళూరులో ఓ ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ కంపెనీలో కవిత పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఆమెకు బెంగళూరులోని ఖరీదైన ప్రాంతం డాలర్‌ కాలనీలో ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసిందన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీల కుటుంబంపై కేటీఆర్‌ తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల అవినీతి బాగోతాన్ని రోజుకొకటి చొప్పున బయటపెడతామని మధుయాష్కీ ప్రకటించారు. తన మీద, తన భర్త మీద ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఆరోపణలతో తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిన్నదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.