ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ రాజీనామా

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. రాజీనామా అనంతరం చంపై రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ఆయన వెంట జేఎంఎం నేతృత్వంలోని కూటమి నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రమాణస్వీకారం చేయనున్నారు.

రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం చంపయి సోరెన్ మాట్లాడుతూ… కొన్ని నెలల కిందట సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తమ నాయకుడిగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నామని, అందుకే ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేశానన్నారు.