ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం

Hemant Soren
Hemant Soren

రాంచీ: జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత జార్ఖండ్‌ గవర్నర్‌ ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. రాంచీలోని మోరాబది మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా సోరెన్‌తోపాటు సిఎల్‌పి నేత అలంగీర్‌ అలం, జార్ఖండ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామేశ్వర్‌ ఒరాన్‌, ఆర్‌జేడి ఎమ్మెల్యె సత్యానంద్‌ భోక్ట మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.కాంగ్రెస్ మాజీ అద్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖాండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/