హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారానికి సోనియాకు ఆహ్వానం

29న జార్ఖండ్‌ సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం

Hemant Soren -Sonia Gandhi
Hemant Soren -Sonia Gandhi

రాంచీ: జార్ఖండ్‌ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 29న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసందర్భంగా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ఆహ్వానించారు. జార్ఖండ్‌ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో హేమంత్ సారథ్యంలోని జేఎంఎం కూటమి ఘన విజయం సాధించింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హేమంత్ నిన్న సోనియా, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 29న జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే సోనియాతో భేటీ అయినట్టు తెలిపారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్ సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారని జీఎంఎం తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/