లాక్‌డౌన్‌లో ఆదుకున్న నేత

పేదలకు చేయూత

Maria Antoniti, Finance Minister of Peru
Maria Antoniti, Finance Minister of Peru

మార్చి, ఏప్రిల్‌ మాసంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు. కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ ప్రకటించాయి .

ఇందులో పెరూ దేశం కూడా ఒకటి. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలకు ఎలాంటి పనులు లేక, పస్తులువ్ఞండాల్సిన సమయం అది.

ఆ సమయంలో పెరూలోని ఆర్థిక మంత్రి మరియా ఆంటోనిటీ పేదలపాలిట పెన్నిధిగా నిలిచారు.

కొన్ని ఉత్పాతాలు ఉప్పెనలు సంక్షోభాలు జనాన్ని ఇబ్బంది పెట్టినా మేటి నాయకుల్ని అందిస్తాయి.

పెరూ ఆర్థికమంత్రి మరియా ఆంటోనిటా ఆల్వా ఈ కష్టసమయంలో సమర్థత, దీక్షాదక్షతతో జనం హృదయాలు గెలుచుకుంటూ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఆమె కొన్నాళ్లు భారత్‌లో పాఠాలు నేర్చుకున్నవారే. ప్రపంచానికే కాదు మరియా ఆంటోనిటీ అంటే నిన్నటిదాకా పెరూలోని జనాలకే పెద్దగా తెలియదు.

కానీ ఇప్పుడామో బాగా పాపులర్‌. ఆమెకు మద్దతుగా వేలాది జనం వీధుల్లోకి వచ్చి జేజేలు పలుకుతున్నారు.

సెల్ఫీలు తీసుకుని పోస్టర్లు వేయించి ఇంట్లో పెట్టుకుంటారు. అభిమానంతో తోచిన బహుమతు లిస్తుంటారు.

ఎందుకంటే ఆమె జనం మెచ్చే నేత. ఎకనామిక్స్‌ డిగ్రీ చదివి 2010లో ఆల్వా ఆర్థికమత్రిత్వ శాఖలో ఉద్యోగిగా చేరారు.

స్కాలర్‌షిప్‌ రావడంతో 2014లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

తర్వాత ఇండియాకు వచ్చి బాలికలకు అందుబాటులో ఉన్న విద్యావకాశాలపై రెండునెలలు అధ్యయనం చేశారు. పెరూ తిరిగెళ్లిన తర్వాత విద్యాశాఖలో ఉన్నతోద్యోగిగా చేరారు.

అంతర్జాతీయ వ్యవహారాలపై మంచి పట్టు ఉండటం, ఆర్థిక విషయాలపట్ల ఉన్న అసాధారణ అవగాహనను గుర్తించి అధ్యక్షుడు మార్టిన్‌ విజ్కారా ఆమెను నూటయాభై మంది ఉద్యోగులుండే బడ్జెట్‌ చీఫ్‌గా నియమించారు.

అక్కడా తనదైన ప్రతిభ చూపడంతో 2019 అక్టోబరులో పెరూ ఆర్థికమంత్రిగా నియమించారు.

35ఏళ్లకే ఆ పదవి అలంకరించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు అల్వా. ఆర్థికమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.

ఆ దేశ ఆర్థిక వృద్ధిరేటును ఏడాదిలోనే గణనీయంగా పెంచగలిగారు. మొదట్నుంచీ ఆమె దృష్టి అంతా పేదుల, చిరుద్యోగులు, చిన్నాచితకా వ్యాపారులపైనే ఉండే వారికి లబ్దికలిగేలా పలు పథకాలు తీసుకొచ్చారు.

కరోనా లాక్‌డౌన్‌తో అన్ని దేశాల్లోలాగే పెరూలోనూ గడ్డు పరిస్థితులొచ్చాయి. ఈ సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేలా భారీ ప్యాకేజీ, చిరు వ్యాపారులకు ఆర్థికప్రయోజనాలు ప్రకటించారు.

కూలీల కడుపు మాడకుండా చూశారు. దీనిపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అక్కడ ఆకలి చావులు, పేదల కష్టాలు మచ్చుకైనా కానరావడం లేదిప్పుడు. ఈ ఫలితాలే ఆమె కీర్తిని పెంచాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/