భారీగా వరద ప్రవాహం…రెండో ప్రమాద హెచ్చరిక

Prakasam Barrage
Prakasam Barrage

విజయవాడ: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి మళ్లీ భారీగా వరద ప్రవాహం పెరిగింది. 7 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 15 అడుగులకు చేరడంతో బ్యారేజీ గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గేట్లు మొత్తం ఎత్తి 5.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. కాగా ప్రవాహం మరింత ఎక్కువైతే ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చే అవకాశముంది. ముంపువాసులు ఇళ్లను వదిలి రోడ్లపైకి చేరారు. జిల్లాయంత్రాంగాన్ని విపత్తు నిర్వహణశాఖ అప్రమత్తం చేసింది. నదీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించింది. పవిత్ర సంగమం వద్ద పుష్కర్‌నగర్‌లోకి వరద నీరు వచ్చి చేరింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/