కృష్ణమ్మ పరుగులు

Dowleswaram Cotton Barrage
Dowleswaram Cotton Barrage


హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉధృతి తగ్గుతుండగా, కృష్ణమ్మ పరవళ్లు తొక్కు తోంది. తూర్పు గోదావరి జిల్లాల్లో గోదావరి వరద ఉధృతి వేగంగా శాంతిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12.7 అడుగులకు చేరింది. దిగువకు 11.4లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి తగ్గుముఖం పడుతున్నా, ముమ్మడివరం పరిధిలోని లంక గ్రామాల్లో పరిస్థితి దయనీయం గానే ఉంది. పది రోజులుగా పంటలు వరద నీటిలో మునిగి కుళ్ళిపోయే స్థితికి చేరిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి రావాల్సిన వంగ, బెండ, మిరప పంటలు వరద పాలయ్యాయంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. పశ్చిమగోదావరిలోనూ వరద కష్టాలకు అంతు లేకుండా పోయింది. జిల్లాలోని అనేక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి.10,12 రోజులు గడుస్తున్నా పోలవరం, వేలేరుపాడు మండలంలోని అనేక ఊళ్లను వరద ముంపు వదలడంలేదు.

చాలా గ్రామాలకు బాహ్య ప్రపం చంతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తు న్నారు. అయోధ్య లంకలో ఇళ్ల చుట్టూ వరద నీరు చేరి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మోకాళ్లలోతుగా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు.
కూరగయాల తోటలు, పచ్చికబయళ్లు నీట ముని గాయి. పశుగ్రాసం అందక మూగజీవాలు అల్లా డుతున్నాయి. చాలా చోట్ల ముంపుగ్రామాల ప్రజ లను పునరావాస కేంద్రాలకు తరలించారు. అచంట మండలం పుచ్చర్లంకలో వరద ఉధృతికి సుబ్బాయమ్మ అనే వృద్దురాలు కొట్టుకుపో యింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఇన్‌ఫ్లో 5,926 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 389 క్యూసెక్కులు,కడెం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో4014 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 659 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో 5570 క్యూసెక్కులు ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/