శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

Srisailam dam
Srisailam dam

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 2.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 866.8 అడుగులుగా ఉంది. అయితే మరో రెండు రోజులు ఇదే ప్రవాహం కొనసాగినట్లయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జలాశయ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 129.15గా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. హంద్రీనీవాకు 1,031 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/