నాగార్జునసాగర్‌ 21 గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar
Nagarjuna Sagar

నల్గొండ: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 21 గేట్లను అధికారులు ఎత్తివేశారు. భారీగా ఇన్‌ఫ్లో ఉండడంతో అన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. సాగర్‌ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రికి పులిచింతల ప్రాజెక్ట్ నిండనుంది. నాగార్జునసాగర్‌కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. సాగర్‌కు భారీగా వరద రావడం 2009 తర్వాత ఇదే తొలిసారి. ఇన్‌ఫ్లో 8 లక్షల 25 వేల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 556 అడుగులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం 223 టీఎంసీలు.
కాగా నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాచర్ల వైపు నుంచి సాగర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్‌ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/