ఏపి ప్రజలకు ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు

temperature
temperature

అమరావతి: ఏపిలో ఎండల తీవ్రత పెరిగిన కారణంగా రియల్‌ టైం గవర్నెన్స్‌( ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ నెల 10 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే మరో మూడు జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగినట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది. నెల్లూరులో 45 డిగ్రీలు, కృష్ణా జల్లా తిరువూరులో 44 డిగ్రీలు, విశాఖ జిల్లా అనంతగిరిలో 30 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా గారలో 32 డిగ్రీలు, అనంతపురం గుదిబండలో 32 డిగ్రీలు, కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/