కురుస్తున్న భారీ వర్షాలు…15 మంది మృతి

heavy-rains
heavy-rains

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో గత మూడురోజులుగాభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 15 మంది మృతి చెందారు. భారీగా జంతు, ఆస్తి నష్టం సంభవించింది. వర్షం ప్రభావం వల్ల 133 భవనాలు నేలకూలాయి. ఉన్నావూ, అంబేడ్కర్‌ నగర్‌, గోరఖ్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకి, హర్దోయ్‌, కాన్పూర్‌ నగర్‌, పిలిభిట్‌, సోనాభద్ర, చందోలి, ఫిరోజాబాద్‌, మావూ, సుల్తాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం నుంచి మరో ఐదు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/