న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం

Heavy rain
Heavy rain

హైదరాబాద్‌ః హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. వ‌ర్షం పడే కంటే ముందు భారీగా ఉరుములు ఉరిమాయి. భారీ వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. మెహిదీప‌ట్నం, మాసాబ్‌ట్యాంక్, నాంప‌ల్లి, సికింద్రాబాద్, బేగంపేట్‌, ప్యాట్నీ, ప్యార‌డైస్, చిల‌క‌ల‌గూడ‌, అల్వాల్, బోయిన్‌ప‌ల్లి, మారేడుప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, ఎల్బీన‌గ‌ర్, మ‌న్సురాబాద్, నాగోల్, వ‌నస్థ‌లిపురం, మీర్‌పేట్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, హైటెక్‌సిటీ, కొండాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. నిన్న రాత్రి న‌గ‌ర వ్యాప్తంగా వాన దంచికొట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాలు గంట‌ల కొద్ది రోడ్ల‌పైనే నిలిచిపోయాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/