ఏపిలో భారీ వర్షాలు.. హెచ్చరించిన అధికారులు

Heavy-Rain
Heavy-Rain

అమరావతి: ఏపిలో మరో నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కన్నబాబు ప్రజలను అప్రమత్తం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/