మరోసారి ఏపిలో భారీ వర్షాలు!

heavy rain
heavy rain

విశాఖ: మరోసారి ఏపిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఏపిలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. చాలా చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా చెదురుమొదురు జల్లులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/