హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం..ఎక్కడిక్కడ నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి 8 గంటలకు మొదలైన వర్షం నగరమంతా దంచికొడుతుంది. ఒక్కసారిగా కురిసిన జోరువానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు, వాహనదారులు నానా కష్టాలు పడుతున్నారు. వర్షం ఇదే విధంగా కొనసాగితే రాత్రికి లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధానంగా అమీర్‌పేట్, పంజాగుట్ల, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, ఖైరతాబాద్, ఉప్పల్, తార్నాక, బాలాగనర్, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈరోజు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్​ అంతరాయం ఏర్పడింది.