తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Heavy Rain
Heavy Rain

New Delhi: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలో భారీనుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశబుూలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరిక జారీ చేసింది. విదర్భ, కొంకణ్‌, గోవా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి పేర్కొంది. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.