మరోసారి హైదరాబాద్‌లో వర్షం

heavy-rain-in-hyderabad

హైదరాబాద్‌: నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తుంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండ‌పోత వాన‌కు రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. భారీ వాన‌ల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం 100కు డ‌య‌ల్ చేయాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, బేగంపేట్, ఉప్పల్, కొత్తపేట, సంతోష్‌నగర్‌, సికింద్రాబాద్‌, మీర్‌పేట్‌, రామంతాపూర్, హబ్సీగూడలో కుండపోతగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో 37 బోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/