ఏపి, కర్ణాటక రాష్ట్రాలో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరిక

heavy-rains
heavy-rains

న్యూఢిల్లీ: ఏపి, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాలో ఈరోజు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. నేడు కేరళతోపాటు కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీవర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. దేశంలోని విదర్భ, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్, మరాఠ్వాడ, కోస్తాంధ్ర, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఒడిశా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో శనివారం పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కేరళ, గుజరాత్, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు చేపలవేటకు అరేబియా సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/