నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం

Chance of heavy rain in the coming days
heavy rain

హైదరాబాద్‌: ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్‌, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం కురింది. అలాగే మలక్‌పేట, చార్మినార్‌, సుల్తాన్‌బజార్‌, కోఠి, ఖైరతాబాద్‌, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసర, చాంద్రయాణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, శివాజీనగర్‌లో వాన పడింది. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే సోమవారం మరోసారి వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/