తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహమూబాబాద్, ఖమ్మం జిల్లాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/