24 వరకు హైదరాబాదును ముంచెత్తనున్న భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి

Heavy rain
Heavy rain

హైదరాబాద్‌: ఇప్పటికే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ తడిసి ముద్దైంది. సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాదులో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావం వల్ల నిన్న నగరంలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/