మరో మూడు రోజులు భారీ వర్షాలు

heavy-rain
heavy-rain

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. బంగాళఖాతం దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కాగా, ఈ రోజు కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో భారీ గా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/