వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు

Heavy Rain-
Heavy Rain-

వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలా బాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం, మరికొన్ని జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిం చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ఆంధ్ర ప్రాంతం లోను వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు, ఈశాన్య భారతావని, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.