బేగం పేట్ చికోటి గార్డెన్ వద్ద భారీగా పోలీసులు మోహరింపు ..కేఏ పాల్ వస్తే అరెస్టు

బేగంపేట్ చికోటి గార్డెన్ లోని జీవన్ జ్యోతి నిలయానికి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వస్తున్న సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ సమావేశం పెట్టాలని పాల్ భావిస్తున్నాడు. అయితే సమావేశానికి పర్మిషన్ లేనందున కేఏ పాల్ వస్తే అరెస్టు చేసామన్న ఆలోచనలో బేగంపేట్ పోలీసులు ఉన్నారు. జీవన్ జ్యోతి నిలయంలో మీటింగ్ కోసం హల్ బుక్ చేసుకున్న జీవన్ జ్యోతి నిలయం వాళ్లు ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా హాల్ బుకింగ్ క్యాన్సల్ చేసుకున్నట్లు సమాచారం.

గత కొద్దీ రోజులుగా పాల్..కేసీఆర్ సర్కార్ ఫై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మంగళవారం కూడా కేసీఆర్, కేటీఆర్, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాస్టర్స్, లీడర్స్ మీటింగ్ తప్పకుండా వస్తానన్నారు. పాస్టర్స్ మీటింగ్ కు పర్మిషన్ అవసరం లేదని పోలీసులు చెబుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డకుంటుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన సమావేశాన్ని విజయవంతం చేసి తీరుతామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను, కిరాయి గుండాలను,టీఆర్ఎస్ కార్యకర్తలు ఉపయోగించుకుని మీటింగ్ ను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.