శిశుమరణాలను ఇలా తగ్గించవచ్చు

గర్భిణీ సంరక్షణ లక్ష్యాలు

Pragnancy
 1. గర్భవతి శారీరక, మానసిక, ఆరోగ్యాన్ని పెంపొందించడం, ప్రసవమయ్యేదాకా ప్రమాదాలు జరగకుండా కాపాడడం.
 2. పరిపూర్ణమైన ఆరోగ్యంతో, జీవంతో, నెలలు నిండాక బిడ్డ పుట్టేలా చెయ్యడం.
 3. స్త్రీని ప్రసవానికి, పాపాయికి, పాలివ్వడానికి, భౌతిక, మానసిక, విద్యాపరంగా బిడ్డను సంరక్షించడానికి సన్నద్ధురాలిని చెయ్యడం.
 4. గర్భిణికి, గర్భస్థ శిశువుకు రాగల ప్రమాదాల్ని తొలిదశలో గుర్తించి చికిత్స చెయ్యడం, పరిశీలన ఉంచడం, ప్రమాదాల్ని నివారించడం.
 5. ఆరోగ్య సమాచారాన్ని గర్భిణికి తెలపడం, గర్భం సమయంలో వచ్చే స్వల్ప సమస్యలకు సలహానివ్వడం, గర్భిణికి, ఆమె భర్తకు ధైర్యం చెప్పడం, ఆసరానివ్వడం, భయాల్ని ఆందోళనలను తొలగించడం.
 6. గర్భస్థ శిశువుకు వైకల్యాలు ఉన్నట్లు గుర్తిస్తే తగిన చికిత్సచెయ్యడం.
 7. ప్రమాద పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ప్రసవం చెయ్యాలో గర్భిణికి అత్యున్నత ప్రమాణాలు గల సంరక్షణ లభించాలి. నిర్ణీత వ్యవధిలో క్రమబద్ధంగా మంత్రసాని, జనరల్‌ ప్రాక్టీషనర్‌ లేక ప్రసూతి నిపుణులు పరీక్షించాలి. సాధారణంగా కమ్యూనిటీలో ఉండే మంత్రసాని గర్భిణీని ఎక్కువసార్లు పరీక్షించడానికి అవకాశం ఉంటుంది.
  గర్భం రాకముందు కౌన్సిలింగ్‌
  గర్భిణి సంరక్షణ ఆమె గర్భవతి అవకముందే ప్రారంభం కావాలి. పిల్లల్ని కనాలనుకునే స్త్రీలు గర్భం రాకముందే ప్రసూతి నిపుణురాలిని సంప్రదించాలి. ప్రసూతి సంబంధమైన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నవారు. ఆరోగ్యపరమైన ఇతర వ్యాధులు ఉన్నవారు తమకు గర్భం రావచ్చో లేదో తెలుసుకోవాలి. కొన్ని వ్యాధులు ఉన్నవారు, ఉదాహరణకు జన్యుసంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నవారు పిల్లల్ని కనగూడని పరిస్థితి ఉండొచ్చు.
Healthy Baby Delivery Tips
Baby care

పోషకాహారం, జీవనశైలిలో అవసరమైన మార్పుల గరించి తెలుసుకోవడం, వైకల్యాల్ని కలిగించగల వాటిని నివారించడం, ఫోలిక్‌ యాసిడ్‌ని తీసుకోవడం మొదలైన వాటి గురించి తెలుసుకుని ఆదరిస్తూ గర్భాన్ని గురించి అవగాహనతో వ్యవహరించడం గర్భిణి సంరక్షణ లక్ష్యాల్ని సాధించడానికి ఉపకరిస్తుంది. గర్భం వచ్చిందని అనుమానం రాగానే సంప్రదించాలి.

అలా చెయ్యడం వల్ల ఆఖరి బహిష్టూ తేదీ బాగా జ్ఞాపకం ఉండి దానిని బట్టి ప్రసవమయ్యే తేదీని లెక్కచెయ్యడానికి, నెలల కనుగుణంగా బిడ్డ పెరుగుతుందా, లేదా అనేది నిర్ణయించడానికి అవకాశముంది. రక్తపోటు, బరువ్ఞ, హిమోగ్లోబిన్‌ మొదట ఎంత ఉన్నామో తెలిస్తే అవి తరువాత సహజమైన మార్పులు చెందాయా లేక అసహజంగా పరిణమించాయా అనేది తెలుస్తుంది.