రోజా పూలతో ఆరోగ్యం ..

ఆరోగ్య సూత్రాలు

Health with rose flowers
Health with rose flowers

రోజా పూలలో సీ విటమిన్‌ ఉంటుంది. రోజూ పూల రేకులకు సూక్ష్మ క్రిములను తరిమికొట్టే శక్తి ఉంది. ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

రోజా పూలను సాధారణంగా రోమాంటిక్‌ వేలో చూస్తారు. కారణం అవి చాలా అందంగా ఉండటం. చక్కటి సెంట్‌ స్మెల్‌ ఇస్తుండటమే. కాస్మాటిక్‌ ఇండస్ట్రీలో రోజా పూలు, రోజ్‌ వాటర్‌ ఎంతో ఉపయోగపడు తున్నాయి.

బరువు తగ్గాలనుకునేఆరు రోజా పూల రేకులను తినవచ్చు. డైరెక్టుగా తినలేకపోతే, ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినవచ్చు. ఫలితంగా బరువు తుగ్గుతారని పరిశోధనల్లో తేలింది.

రోజా పూలు తింటే, శరీరంలో మెటబాలిజం చక్కగా పనిచేస్తుంది. అంటే అన్ని అవయవాల పనితీరూ మెరుగవుతుంది. బ్యాలెన్స్‌ అవుతుంది.

రోజా పూల వాసన స్ట్రెస్‌ తగ్గిస్తుంది. ఒత్తిడిలో ఉండేవారు రోజ్‌పూలను వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.

రోజూ స్నానం చేసే ముందు రోజా పూలరేకల్ని అరగంట పాటూ నీటిలో ఉంచి, ఆ నీటితో స్నానం చేస్తే, ఎంతో రిలాక్స్‌ ఫీల్‌ కలుగుతుంది.

రోజాలలో సి విటమిన్‌ ఉంటుంది. ఇది మన చర్మ కణాలను రిపేర్‌ చేస్తుంది. పాడైన కణాలు పునరుజ్జీవం పొందుతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగు తుంది.

రోజాలు మన శరీరాన్ని చల్లబరుస్తాయి. కళ్లు మంటగా ఉండేవారు.. కొన్ని రోజాల రేకుల ను కళ్లపూ
ఉంచు కుంటే, ఇర్రిటేషన్‌ తగ్గి, కూల్‌గా అనిపిస్తుంది.

Health with rose flowers
Health with rose flowers

రోజ్‌వాటర్‌లో సూక్ష్మక్రిములతో పోరాటే గుణం ఉంటుంది. ఈ నీటితో కళ్లు, ముఖాన్ని కడుక్కుంటే.. చర్మం మరింత కోమలంగా మారడమే కాదు.. ముఖం, కళ్లలో ఉండే సూక్ష్మక్రిములు వదిలిపోతాయి.

మతి మరపు సమస్యలు ఎక్కువ వుతుంటే, రోజా పూల రేకులను తిన్నా, వాసన చూసినా మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోజ్‌ వాటర్‌, రోజ్‌ ఆయిల్‌ కూడా ఇలాంటి ఫలితాలు ఇస్తాయి.

మైగ్రేన్‌ తలనొప్పి వంటివి ఉన్నవారు రోజ్‌ ఆయిల్‌తో మర్దన చేసుకుంటే ఎంతో మేలు కలుగు తుంది,

మహిళల్లో రుతుస్రావ సమస్యలు ఉన్నవారు.. రోజాల రేకులను తింటే మంచిది. సంతాన సాఫల్య సమస్యలకు కూడా ఇవి చెక్‌ పెడతాయి.

ఐతే రోజా పూల రేకులను బాగా కడిగిన తర్వాతే తినాలి. ఎందుకంటే వాటిపై పురుగు మందులు చల్లుతుంటారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/