చిట్కాలు

ఆరోగ్యానికి చిట్కా వైద్యం

Amla Juice
  • ఇంటింటి మామిడి పండు తినగానే గోరు వెచ్చని పాలు తాగితే దాని దోషమేమైనా ఉంటే పోతుంది.
  • పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక చక్కెరకేళి అరటిపండు, సాయంత్రం వెలగపండు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
  • బొప్పాయి పండు తినగానే కొంచెం పంచదార తినాలి.
  • పనస తొనలు తినగానే ఒక అరటి పండు తినాలి. లేదా ఆఖరి తొనను నూనెలో ముంచుకుని తినాలి.
  • అనాస పండు తినగానే ఉప్పు, పంచదార నమలాలి.
  • జీడిపప్పు, బాదంపప్పు, సారపప్పు మొదలైన వాటిని తినేముందు వాటిపై ఒక చిటికెడు సాల్టు చల్లుకోవాలి.
  • నేతి వంటకాన్ని తిన్న తర్వాత చల్లని నీటిలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగాలి.
  • బాగా మగ్గని పండ్లను తిన్నప్పుడు కొంచెం బెల్లం తినాలి.
  • పులిహోర తిన్న తరువాత గోరువెచ్చని నీళ్లు తాగాలి.
  • నేరేడు పండ్లను రెండు నిమిషాలు ఉప్పునీటిలో ఉంచి తినాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/