కరోనా జాగ్రత్తలే చెప్పే డైరెక్టరే..మాస్క్ పెట్టుకోకుండా జనాల మధ్య చిందులు

కరోనా జాగ్రత్తలే చెప్పే డైరెక్టరే..మాస్క్ పెట్టుకోకుండా జనాల మధ్య చిందులు

రోజు కరోనా తీవ్రత ఎలా ఉందొ చెపుతారో..కరోనా జాగ్రత్తలు చెపుతారు..ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని..లేదంటే ఫైన్ వేస్తారని చెపుతారు..ఆలా కరోనా జాగ్రత్తలు చెప్పే హెల్త్ డైరెక్టరే నిమజ్జనంలో డ్యాన్సులు చేయడం..అది కూడా మాస్క్ లేకుండా చుట్టూ జనాల మధ్య చిందులు వేయడంఫై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా గణపతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

ఈ తరుణంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. లడ్డూ వేలం పాట అనంతరం గణేశుడిని నిమజ్జనానికి తరలిస్తున్న సందర్భంగా ఆయన తీన్మార్ డప్పులకి స్టెప్పులు వేశారు. డాన్సులు వేయడం తప్పు కాదు కానీ మాస్క్ లేకుండా ఆయన ఉండడం ఫై అంత కామెంట్స్ చేస్తున్నారు. హెల్త్ డైరెక్టర్ అయ్యుండి మాస్కులు లేకుండా.. సామాజిక దూరం పాటించకుండా స్టెప్పులేంటని విమర్శిస్తున్నారు.