తెలంగాణలో ఒమిక్రాన్ ఎంట్రీ ఫై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు క్లారిటీ

ఒమిక్రాన్‌ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని అనుకునేలోపే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లో ఈ ఒమిక్రాన్‌ అనే వేరియంట్ బయటపడింది. దీంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త మహమ్మారి కేసులు బయటపడ్డాయనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నేపథ్యంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ వైరస్ ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఒమిక్రాన్ ఇంకా ప్రవేశించలేదని.. తప్పుడు వార్తలను ఎవరూ కూడా నమ్మవద్దని.. అలాగే ఎవరూ తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయవద్దని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి 41 మంది హైదరాబాద్ వచ్చారని… వారికి కరోనా పరీక్షలు చేశాం.. ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదని క్లారిటీ ఇచ్చారు. కొత్త వేరియంట్ ఆరు రేట్లు ఉదృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు. కొత్త వేరియంట్ వచ్చి 7 రోజులవుతుందని… 14 రోజుల తర్వాత పూర్తి స్థాయి లక్షణాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఒళ్ళు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉండే అవకాశం ఉందని… ఒమిక్రాన్ వేరియంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లో తేడా లేదని తెలియ జేశారు.