ప్రాణాంతక వ్యాధులకు దూరంగా..

ఆరోగ్యం – సంరక్షణ

health care-Stay away from deadly diseases
health care-Stay away from deadly diseases

కొత్త వైరస్ ఏదో వచ్చి ప్రాణాలు తీస్తోందని తెలిస్తే చాలు ..అందరూ ఆందోళనకు గురవుతారు.. కానీ, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడటానికి వచ్చిపడిన వైరస్ కాదు , మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోవటం కారణం.. ఆ శక్తి ని నిలకడగా ఉంచుకోవటం , ఐనా పెంచుకోవటం విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. వాతావరణ కాలుష్యం వ్యాధి నిరోధక శక్తిని బాగా తగ్గిస్తున్నాయి. విదేశాల్లో ఐటెట్ సూర్య రశ్మి కూడా సరిగా లభ్యం కాక వ్యాధి నిరోధక శక్తి తగ్గి పోతుంది.. దాని పరిణామంగానే కొన్ని రకాల వైరస్ లతో వణికిపోయే పరిస్థితి వస్తోంది. ఇపుడు మానవాళిని భయాందోళనలకు గిరుచేస్తున్న కరోనా వైరస్ విషయంలో ఇదే జరుగుతూ ఉంది. ఈ స్థితిలో ఎవరైనా చేయాలసింది ఒక్కటే. వ్యాధి నిరోధక శక్తి ని బాగా పెంచుకోవటం, కరోనా వైరస్ సోకినా వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే శ్వాస కోశానికి సంబంధించిన వ్యాధి సోకినా ఈ లక్షణాలు కన్పిస్తాయి. . అందువల్ల వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వైరస్ ను గుర్తిస్తే తప్ప, అది కొరోనాయే అని నిర్ధారణకు రావటం సాధ్యం కాదు.. వైరస్ సోకిన తర్వాత చికిత్స తీసుకోవటం అంతా వేరు.. అసలు వైరస్ సోకకుండా నిరోధించే ప్రయత్నం అన్నిటికన్నా ముఖ్యం.

‘నాడి’ (ఆరోగ్య విషయాలు ) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/