మోదక్‌లో ఆరోగ్య ప్రయోజనాలు

ఆహారం-ఆరోగ్యం

Health benefits in Modak
Health benefits in Modak

మోదక్‌ బియ్యం పిండి లేదా మొక్కజొన్న పిండితో తురిమిన కొబ్బరి, బెల్లంతో తయారు చేసే తీపి వంటకం. ముఖ్యంగా గణేష్‌ చతుర్థి సందర్భంగా తయారుచేసే ప్రసిద్ధ స్వీట్లలో ఇది ఒకటి.

అయినప్పటికీ ఇది ఒక రుచికరమైన పదార్థాలలో ఒకటి. పంచదార, బెల్లం, బియ్యం పిండికి ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించి కూడా చేయవచ్చు.

కొబ్బరి బెల్లం బదులు బీట్‌రూట్‌, ఓట్స్‌, ఫ్రూట్‌ ఫిల్లింగ్‌లతో మోదక్‌ లోపల స్టఫింగ్‌ కూరి తయారు చేసుకోవచ్చు.

వేయించాలనుకుంటే నూనెకి బదులుగా నెయ్యి వాడడం మంచిది. గింజలు, పండ్లతో కూడా మోదక్‌లలో నింపి చేసుకోవచ్చు.

గింజల్లో అసంతృప్త కొవ్వు, ఒమేగా 3, విటమిన్‌ ఇ అధికంగా ఉంటుంది. ఇది ధమనులలో ఫలకాల అభివృద్ధిని నిరోధిస్తుంది. అధిక ఫైబర్‌ ఉంటుంది.

పోషకాలు ఎక్కువే. పండ్లలో విటమిన్లు, ఫైబర్‌, పొటాషియం, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఫ్రూట్‌ స్టప్డ్‌ మోదక్‌లు ఆరోగ్యకరమైనవి. చురుకుగా ఉండటానికి సహాయపడతాయి.

బీట్‌రూట్‌ను స్టఫ్‌గా చేసి మోదక్‌లను తయారు చేస్తే రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం.

బీట్‌రూట్‌లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, కండరాల కదలికలను తగ్గించే పొటాషియం, ఎములను బలోపేతం చేసే మాంగనీస్‌ ఉంటాయి.

తురిమిన్‌ బీట్‌రూట్‌ను మోదక్‌లలో నింపి తయారు చేస్తే మంచి అవి తినడం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/