నిజాయతీ గల ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు కోల్పోయారు

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి సర్కార్‌ కూలిపోవంపై రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, శశి థరూర్‌ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే.. ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు పన్నారని బిజెపి పై రాహుల్‌ మండిపడ్డారు. తాజా పరిస్థితిపై ఆయన ట్వీట్‌ చేశారు.
ఖకాంగ్రెస్‌జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచి ఇంటా బయటా వారిని లక్ష్యంగా చేసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒక ముప్పుగా వారు భావించారు. ఈరోజు వారి స్వార్థమే గెలిచింది. ప్రజాస్వామ్యాన్ని, నిజాయతీ గల ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు కోల్పోయారు అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అన్నింటినీ డబ్బుతో కొనలేమని ఏదో ఒకరోజు బిజెపి తెలుసుకుంటుంది. ప్రతి ఒక్కరినీ మోసం చేయడం కుదరదని, ప్రతి అబద్ధాన్ని ప్రజలపై రుద్దలేరని వారికి తెలిసి వస్తుంది అని ప్రియాంక ట్వీట్‌ చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/