నా స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం ఎంపిక

Aditya Puri, HDFC Bank CEO and MD
Aditya Puri, HDFC Bank CEO and MD

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పురి ఆయన స్థానాన్ని భర్తీ చేసే సరైన వ్యక్తి కోసం ఎంపిక ప్రక్రియ మరికోన్నాళ్లలో ప్రారంభం కానుంది. ఈ విషయం పై ఆయన మాట్లాడుతు తన స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చే వ్యక్తి అక్కడి పనిని రెండువారాల్లో నేర్చుకోగలిగేట్లు ఉండాలని ఆయన తెలిపారు. నా తర్వాత వచ్చే వ్యక్తి నన్ను ఏడాది పాటు మెంటార్‌గా ఉండాలని కోరుకుంటే.. అటువంటి వ్యక్తి నా స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరంలేదుగగ అని పురి సంస్థ ఏజీఎంలో పేర్కొన్నారు.
2020 అక్టోబర్‌లో పురి 70వ ఏట అడుగుపెట్టనున్నారు. భారత్‌లో అత్యంత విజయవంతమైన బ్యాంకును నిర్మించిన వ్యక్తిగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1994లో బ్యాంక్‌ ప్రారంభం నుంచి చీఫ్‌గా పని చేస్తున్నారు. బ్యాంక్‌ అభివృద్ధిలో పురి పాత్ర ఎనలేనిది. 2016లో ఆయనకు గుండెకు శస్త్రచికిత్స చేశారు. 2018మేలో పురి మాట్లాడుతూ తన స్థానాన్ని భర్తీ చేసేందుకు బోర్డు వేట మొదలు పెట్టనుందన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/