పురోగమించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు

ఏడాది గరిష్టస్థాయిలో ఆల్‌టైమ్‌ గరిష్టం

HDFC Bank
HDFC Bank


ముంబై: డిసెంబరు ఆర్థిక సంవత్సరం ఫలితాలు అనుకున్న రీతిలో ఉండడంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు షేరుకు సోమవారం డిమాండ్‌ పెరిగింది. ఇంట్రాడేలో షేరు 2శాతానికిపైగా పుంజుకుని రూ.1500కు చేరింది. ఇది ఏడాది గరిష్టస్థాయితో పాటు ఆల్‌టైమ్‌ గరిష్టం కావడం విశేషం.

ప్రస్తుతం ఈ స్టాక్‌ డే గరిష్టానికి చేరి 2శాతం లాభంతో రూ.1496.05వద్ద కదులుతోంది. డిసెంబరు 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అనుకున్న ఫలితాలను సాధించింది. కంపెనీ నికరలాభం 18శాతం వృద్ధితో రూ.8758కోట్లకు చేరింది.

బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 15శాతం వృద్ధితో రూ.16,318కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం 30శాతం వృద్ధితో రూ.6669కోట్ల నుంచి రూ.7443 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4.2శాతానికి చేరింది. ఇక బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 27బేసిస్‌ పాయింట్లు పెరిగి 0.81శాతానికి చేరింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/