బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ సూసైడ్‌

నాన్నా..అప్పులు వసూలు చేసుకొని ప్రశాంతంగా ఉండండి

hdfc bank deputy manager suicide
hdfc bank deputy manager suicide

హైదరాబాద్‌: నాన్నా .. అప్పులు వసూలు చేసుకొని ప్రశాంతంగా ఉండండి.. నా భార్యకు రెండో వివాహం చేయండి.. అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తలూరి శ్రవణ్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌లోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన హరితతో వివాహం జరిగింది. జూబ్లీహిల్స్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని దంపతులు ఉంటున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా మానసికంగా కుంగిన అతను శనివారం పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడ్ని మ్యాక్సిక్యూర్‌ ఆస్పత్రికి తరలించింది. శ్రవణ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రవణ్‌ ఓ సూసైడ్‌ నోట్‌ రాశాడు. నాన్నకు అప్పులు వసూలు చేసి పెట్టడంలో ఎవరైనా సహాయ పడాలని కోరాడు. తన భార్యకు రెండో వివాహం చేయాలని, అలాగే తనకు రావాల్సిన బాకీ డబ్బుతో అంత్యక్రియలు చేయాలని కోరారు. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నాడు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/