పాఠశాలలు పున:‌ప్రారంభం అవుతున్న వేళ తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

కరోనా ఉదృతి కారణంగా ఏడాదిన్నర గా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ క్లాస్ లతో సరిపెట్టుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గడం తో విద్యాసంస్థలు పున:‌ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపటినుండి (సెప్టెంబర్ 1 ) అన్ని విద్యాసంస్థలు పున:‌ప్రారంభించాలని ఏర్పట్లు చేసారు. ఈ తరుణంలో హైకోర్టు పున:‌ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా హైకోర్టు… ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని అలాగే గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ఇప్పట్లో ప్రారంభించవద్దని సూచించిందని. దీనిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ను ఆదేశించింది హైకోర్టు.