సమ్మెకు ముగింపు పలకాలి

కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి హైకోర్టు సూచన

High Court
High Court

హైదరాబాద్ : ఆర్‌టిసిలో సమ్మెకు ముగింపు పలకాలని కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పండగ వేళ ప్రజారవాణాను నిలిపివేయడం పట్ల ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు సమ్మె పై కేసు విచారణ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చే సింది. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతవే కా వచ్చు కాని పండుగల సమయంలో సమ్మెకు సమకట్టడం మంచిది కాదని అభిప్రాయపడింది. తొం దర పడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కార్మికులకు హితవు చెప్పింది. ప్రజల ఇబ్బందులను కార్మి క సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలన్నది. కా ర్మికులు సమ్మె విరమించాలని వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని రెండు వైపుల వారికీ సూచించింది. సమ్మెలోని వారిపై ఎస్మా ఎందుకు అమలు చేయకూడదో చెప్పాలని కార్మిక సంఘాలను ప్రశ్ని ంచింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో కేసును 18వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికి సమ్మెపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్‌టిసిని విలీనం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియజేసింది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని డిమాండ్లు పరిష్కారం కాకుండా సమ్మె విరమించడం సా ధ్యం కాదని కార్మిక సంఘాల జెఎసి తెలిపింది.

ఆర్‌టిసికి తక్షణమే ఎండి నియమించాలని ఆదేశించిం ది. కోర్టు ఆదేశాలపై స్పందించిన ఆర్‌టిసి జెఎసి నాయకులు.. అంతకు ముందు విచారణ లో భా గంగా.. ప్రభుత్వం, ఆర్‌టిసి యూనియన్ల పట్టుదల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాగే విచారణలో భాగంగా ప్రభుత్వానికి, యూనియన్లకు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కార్మికులు నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని కోర్టు తెలిపింది. అలాగే ఆర్‌టిసి సమ్మె విరమణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వం సెల్ఫ్‌డిస్మిస్ చేసిందని పిటిషర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆర్‌టిసి జెఎసి తెలిపింది. సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని పేర్కొంది. మరోవైపు ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆర్టీసీని విలీనం చేస్తే మరిన్ని కార్పొరేషన్లు ముందుకొస్తాయని కోర్టుకు విన్నవించింది. చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని ఈసందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. సుమారు నాలుగువేల బస్సులు నడవడం లేదని.. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడింది. కార్మికులు సమ్మె విరమించాలని, ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించాలని సూచించింది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/