చెన్నై జట్టుకు మరో ఎదురుదెబ్బ

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వరుసగా ఐపీఎల్-14 నుండి బయో బబుల్‌లో రెండు నెలలు గడపడం ఇష్టం లేకపోవడంతో పలువురు ఆసిస్ ఆటగాళ్లు ఏయేడు ఐపీఎల్ నుండి వాకౌట్ చేస్తున్నారు.

తాజాగా ఆసిస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు జాష్ హేజల్‌వుడ్ కూడా ఈయేడు ఐపీఎల్ లీగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే 10 నెలలుగా బయో బబుల్, క్వారంటైన్‌లో ఉంటూ వస్తున్న ఈ క్రికెటర్ మళ్లీ రెండు నెలలపాటు అదే జీవితం గడిపేందుకు ఇష్టంగా లేడని తేల్చి చెప్పాడు. గతేడాది నుండి విశ్రాంతి లేకుండా వరుసబెట్టి టోర్నీలలో ఆడుతూ వస్తున్నాడు. దీంతో అతడు ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే తన కుటుంబంతో సమయం గడిపేందుకు ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు జాష్ ప్రకటించాడు.

ఇక ఐపీఎల్ తరువాత కూడా జాష్ హేజల్‌వుడ్‌కు వరుసగా టోర్నీలు ఉన్నాయని, వాటి కోసం సిద్ధం కావాలంటే ప్రస్తుతం విశ్రాంతి తప్పనిసరి అని అతడు అంటున్నాడు. ఏదేమైనా జాష్ హేజల్‌వుడ్ నిష్క్రమణ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరి మున్ముందు ఐపీఎల్ నుండి ఎవరెవరు వెళ్లిపోతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.