టిఆర్‌ఎస్‌లోకి కొల్లాపూర్‌ ఎమ్మెల్యే

harshavardhan reddy
harshavardhan reddy, kollapur mla

హైదరాబాద్‌: తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఏ పార్టీకి, ఏ నేత రాజీనామా చేసినా వచ్చి అందరూ టిఆర్‌ఎస్‌ సంద్రంలో కలిసిపోతున్నారు. ఆ నేపథ్యంలోనే కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఆ పార్టీని వీడి గులాబి గూటికి చేరనున్నారు. ఈ మేరకు టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌తో బుధవారం సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరతారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.