సైకిల్‌పై వచ్చి బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి

Dr Harsh Vardhan
Dr Harsh Vardhan

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తన నివాసం నుండి కార్యాలయానికి సైకిల్‌పై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగాఆరోగ్య రంగంలో ప్రధాని మోదీ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఆరోగ్యకర భారతావని కోసం అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకునేలా అవగాహన కల్పిస్తామని హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు ప్రజలందరికీ చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు. జూన్‌ 3ను ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీని తెలియజేసేందుకే హర్షవర్ధన్‌ సైకిల్‌పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/