హర్లా ఫర్లా సాంగ్‌తో ఆకట్టుకుంటున్న ‘చక్ర’విశాల్ ‌హీరోగా విశ్వరూపం

హర్లా ఫర్లా సాంగ్‌తో ఆకట్టుకుంటున్న 'చక్ర'విశాల్ ‌హీరోగా విశ్వరూపం
Vishal in ‘Chakra’

యాక్షన్‌ హీరో విశాల్‌ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర.. శ్రద్ధాశ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.. రెజీనా కసాంధ్ర ఓ కీలకపాత్రలో నటిస్తోంది.. ఈచిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ ఆకట్టుకుంది.. ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హర్లా ఫర్లా సాంగ్‌తో ఆకట్టుకుంటున్న 'చక్ర'విశాల్ ‌హీరోగా విశ్వరూపం

తాజాగా ఈచిత్రం నుంచి యువన్‌ సంగీతం అందించిన హర్లా ఫర్లా.. సాంగ్‌ను విడుదలచేశారు.. ‘నీచూపుల్లోనే నాటీ గ్రాఫిటీ, .. అంటూ జోష్‌ఫుల్‌గా సాగే ఈ పాటకు డాక్టర్‌ చల్లా భాగ్యలక్ష్మి నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా సాహిత్యం అందించారు.. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.. డిజిటల్‌ క్రైమ్స్‌, బ్యాంక్‌ రాబరీ, హ్యాకింగ్‌ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఈచిత్రం రూపొందుతోంది.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈమూవీ విడుదల కానుంది..