2.o ఓ గొప్ప ఫీలింగ్‌

harish shanker
harish shanker

రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్ తో మరియు భారీ నిర్మాణ విలువలతో సాగుతూ ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇస్తోంది. సినిమా చూస్తున్నంతసేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక సినీ విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ట్విటర్ ద్వారా ఈ సినిమా పట్ల తన స్పందనను పోస్ట్ చేస్తూ.. ‘హ్యాట్సాఫ్ శంకర్ సార్‌కి. సినిమా ఎక్స్ పీరియన్స్ లోనే ఇదివరకు ఎప్పుడూ చూడనటువంటి ఓ గొప్ప ఫీలింగ్‌ ని ‘2.ఓ’ కలుగజేస్తోంది. ఒక్క తలైవా రజినీకాంత్‌ తోనే ఇలాంటి అద్భుతం సాధ్యం అవుతుంది ’ అని ట్వీట్‌ చేశారు.