తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు – మంత్రి హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి హరీష్ రావు. మేడ్చల్ లో మాతాశిశు సంక్షేమ హాస్పటల్ కు బుధువారం మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా బిజెపి నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. 2022 జనవరిలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నాయని పార్లమెంట్ లో ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పిన షేకావత్..నిన్న యాదగిరి గుట్ట బీజేపీ సభలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేంద్రమంత్రి అయివుండిఅబద్దాలు మాట్లాడుతున్నారని.. రాజకీయ లబ్ది కోసమే ఆలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పారిశ్రామికవేత్తల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని , బీజేపీ ఎయిమ్స్ పరువు తీస్తోందని..ఎయిమ్స్ పరిస్థితి పేరు గొప్ప..ఊరు దిబ్బగా మారిందన్నారు. ఎయిమ్స్ లో ఒక్క డెలవరీ కాలేదన్న హరీష్ రావు.. పక్కనే ఉన్న పీహెచ్సీలో 11డెలవరీలు అయినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 57 రకాల వైద్య పరీక్షలు పైసా ఖర్చు లేకుండా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ హాస్పటల్స్ లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, ఒక్క పైసా ఖర్చవకుండా 12వేల 500రూపాయలు, కేసీఆర్ కిట్ ఇచ్చి బాలింతలను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిస్తున్నామన్నారు. కొందరు ముహుర్తాలు చూస్తూ కాన్పు చేయాలని డాక్టర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని..ఇది మంచి పద్ధతి కాదన్నారు. దీని వల్ల లేనిపోని చిక్కులు తెచ్చుకుంటూ తల్లి బిడ్డకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.

Sudheer

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

rajasingh రేపటి మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటామని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించడంతో… ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకుని లాలాగూడ…

4 hours ago

రేపు కడప జిల్లాలోని సిద్ధవ‌టం గ్రామంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌చ్చ‌బండ కార్యక్రమం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్…

5 hours ago

టీడీపీలో చేరిన వైస్సార్సీపీ గోవ‌ర్ధ‌న్ రెడ్డి..

వైస్సార్సీపీ పార్టీ కి బిగ్ తగిలింది. పార్టీ నేత గోవ‌ర్ధ‌న్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా…

5 hours ago

అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మునుగోడు లో ఈ నెల 21 న బిజెపి…

5 hours ago

వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేసారంటూ కేసీఆర్ ఫై ఈటెల ఆరోపణ

మునుగోడు లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని , పోలీసులు, డబ్బును నమ్ముకుని గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని..ఇందులో భాగంగానే…

6 hours ago

నారాయణ కాలేజీ ఘటన ఫై మధు యాష్కీ సీరియస్

అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై…

6 hours ago