డెంగీ కేసుల ఫై అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షా

Harish Rao

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు సమీక్షా నిర్వహించారు. వైద్యారోగ్య, మున్సిప‌ల్ శాఖ‌ల‌తో క‌లిసి డెంగీ నివార‌ణ‌కు ప్ర‌భుత్వం యుద్ధ‌ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో డెంగీపై ప్ర‌భుత్వం యుద్ధం ప్ర‌క‌టించింది. జీహెచ్ఎంసీ స‌హా అన్ని మున్సిపాలిటీల్లో జ్వర స‌ర్వే నిర్వ‌హించాల‌ని హరీష్ రావు ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో బూస్ట‌ర్ డోస్ విరివిగా వేసే కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయాల‌ని తెలిపారు.

ఈ సందర్బంగా మీడియా తో హరీష్ రావు మాట్లాడుతూ..ప్ర‌తి ఐదేండ్ల‌కు ఒక‌సారి డెంగీ కేసులు పెరుగుతుంటాయ‌ని తెలిపారు. ఇది ఐదో ఏడాది కాబ‌ట్టి.. కేసుల తీవ్ర‌త‌ను గ‌మ‌నిస్తున్నాం. హైద‌రాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో వైద్యారోగ్య‌, పుర‌పాల‌క, పంచాయ‌తీ శాఖ‌లు క‌లిసి ప‌ని చేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో జులై నెల‌లో 542 డెంగీ కేసులు న‌మోదైతే.. ఆగ‌స్టులో ఆ సంఖ్య 1827కి చేరింద‌న్నారు. ఈ క్ర‌మంలో అంద‌రూ అప్ర‌మ‌త్త‌మై నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇంటి ప‌రిస‌రాల్లో మురుగు నీరు లేకుండా చూసుకోవాల‌న్నారు. తొట్టిలు, కొబ్బ‌రిచిప్ప‌లు, పాత టైర్ల‌ను దూరంగా ఉండేలా చూసుకోవాల‌ని మంత్రి సూచించారు.