వైఎస్ షర్మిల ఎక్కడ అడుగుపెడితే అక్కడ దరిద్రమే అంటూ హరీష్ రావు ఆగ్రహం

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఫై టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. వైఎస్ షర్మిల ఎక్కడ అడుగుపెడితే అక్కడ దరిద్రమే అన్నారు. ఆనాడు తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్ట, బీడినా అన్నారని.. వాళ్ళ పిల్లలు వచ్చి ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారని హరీష్ రావు అన్నారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని , మీరు వచ్చి ఇక్కడ తిరుగుతామంటే అంతకంటే దరిద్రం ఉండదు..ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.

వైస్ షర్మిల పార్టీ ప్రకటన దగ్గరి నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసందే. ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తూ..కేసీఆర్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. తాజాగా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యంతో ప్రజలకు అర్థమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు షర్మిల.

అయ్యా ఆరోగ్యమంత్రి! మీ సర్కారు సేవలు, సర్జరీల బాగోతం మొన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో చనిపోయిన మహిళలని చూస్తే తెలుస్తుంది అంటూ చురకలంటించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు మీరు ఆరోగ్యశ్రీ డబ్బులు ఎగ్గొడితే, అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక, దేవుడి మీద భారం వేసి, సర్కార్ దవాఖాన్లకు వస్తేనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు పెరిగాయి తప్పితే మీరు సౌకర్యాలు కల్పిస్తే కాదు మంత్రి గారు అంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలో మంత్రి హరీష్ రావు పై మండిపడ్డారు.

షర్మిల కామెంట్స్ కు హరీష్ రావు అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని , మీరు వచ్చి ఇక్కడ తిరుగుతామంటే అంతకంటే దరిద్రం ఉండదు..ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.