కాంగ్రెస్‌, బిజెపిలకు డిపాజిట్లు కూడా దక్కవు

harish rao
harish rao


మెదక్‌: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపిలకు డిపాజిట్లు దక్కవని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నర్సాపూర్‌లో మెదక్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ద్వారా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. బస్సుడిపోను ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్‌, బిజెపిలకు ఓట్లు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనన్నారు. రోడ్‌ షోలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌ రెడ్డి, మదన్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/