ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి

చింతమడక అభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం

 Harish-Rao
Harish-Rao

సిద్దిపేట: ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో చింతమడక గ్రామాభివృద్ధి ప్రణాళికపై జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామిరెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై ప్రణాళికలు రూపొందించారు.చింతమడక అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని, ఎర్రవల్లి తరహాలో సమష్టి ఐక్యతతో ముందుకెళ్దామని హరీశ్‌రావు అన్నారు. కెసిఆర్ స్వగ్రామమైన చింతమ డకకు వచ్చిన సందర్భంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్న హమీపై చింతమడక, మాచా పూర్, సీతారాంపల్లిల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించే విషయమై జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. ఎర్ర వల్లి, నర్సన్నపేట గ్రామాల తరహాలో అభివృద్ధి కమిటీలతో గ్రామస్థుల సహకారంతో ముందడుగు వేద్దామన్నారు. అలాగే ఈ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఎర్రవల్లిలో జరిగిన అభివృద్ధిపై గ్రామస్థులకు అవగాహన కల్పించాల్సి న అవసరం ఉందన్నారు. చింతమడక గ్రామాల్లో నూతన ఇండ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్థులు ఈ విషయంలో సహకరించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/