Minister-Harish Rao
సిద్ధిపేట: ఈరోజు సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో మంత్రి హరీశ్ రావు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీటర్లు కావాలనుకుంటే బిజెపికి, మీటర్లు వద్దు అనుకుంటే మన కెసిఆర్ సారుకు, టిఆర్ఎస్ కారుకు ఓటేయాలని అన్నారు. గత ఆరేళ్లుగా టిఆర్ఎస్ సర్కారు రైతుల కోసమే పనిచేసిందని, కానీ బిజెపి రైతులకు మేలు చేయకుండా బాంబులు వేస్తోందని విమర్శించారు. బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసి, బిల్ కలెక్టర్లతో వసూళ్లు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే, ప్రజలు సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఓట్ల కోసం వచ్చే వారెవరో, కష్టపడి పనిచేస్తున్నది ఎవరో గుర్తించాలని తెలిపారు. తెలంగాణలో కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా నిలిచిపోలేదని స్పష్టం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నలుగురు కూడా దక్షిణాదికి చెందిన వారే కావడం…
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..సీఎం జగన్ కు లేఖ రాసారు. పేదపిల్లలకు ప్రభుత్వ విద్యని దూరం చెయ్యొద్దని…
రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడ్డ నందమూరి బాలకృష్ణ..మళ్లీ సినిమా షూటింగ్లలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్…
ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ లో సీనియర్ నటుడు వేణు…