హరీష్‌ రావు, కెటిఆర్‌లు నాపై కక్ష కట్టారు..

sampath kumar
sampath kumar

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్‌ రావు, కెటిఆర్‌లు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ ఆరోపించారు. హరీష్‌ రావు, కెటిఆర్‌లను చింటూ, పింటూ అని విమర్శించినందుకు తనపై కక్ష కట్టారని అన్నారు. వారితో ఉన్న స్నేహ సంబంధాల కారణంగానే అలా సంబోధించానని అన్నారు. తాను ఎలాంటి బుతూలు మాట్లాడకుండా ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేస్తే..వారు తనను వ్యక్తిగంతా టార్గెట్‌ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు గాంధీ భవన్‌లో సంపత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. నాకు గన్‌మెన్‌లను తీసేశారు. మా అన్నను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా తొలగించారు. నా తమ్ముడికి న్యాయపరంగా వచ్చిన మున్సిపాలిటీ కాంట్రాక్ట్‌లను తొలగించారు. నాతోపాటు మాజీ ఎమ్మెల్యేలందరికీ ఏడాదికి పైగా రావాల్సిన పెన్షన్లను ఆపేశారు. తనపై కక్ష సాధింపు ధోరణితో పైశాచిక ఆనందాన్ని కెటిఆర్‌, హరీష్‌ రావు పొదుతున్నారు. కానీ నాపై కక్ష సాధిస్తే నేను ప్రశ్నించకుండా ఉంటాననుకుంటే అది వారి మూర్ఖత్వమేనని అన్నారు. వాళ్లు ఎన్ని చేసినా వారిపై పోరాటం ఆపే ప్రసక్తి లేదన్నారు సంపత్‌ కుమార్‌.

తాజా ఎపీ వార్తల కోస క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/