కేజీయఫ్‌ నటుడ్ని వివాహం చేసుకోబోతున్న నటి హరిప్రియ

నటి హరిప్రియ..కెజిఎఫ్ ఫేమ్ వశిష్ట సింహను వివాహం చేసుకోబోతుంది. కన్నడలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రియ.. హీరోయిన్ భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘పిల్ల జమీందార్’, ‘అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, బాలయ్య ‘జై సింహా’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా కెజిఎఫ్ మూవీ లో విలన్ రోల్ లో నటించిన వశిష్ట సింహ తో ప్రేమలో పడింది.

గత కొద్దీ రోజులుగా ప్రేమాయణంలో ఉన్న వీరిద్దరికి డిసెంబర్ 2న నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మీ ఆశీస్సులు కావాలి’’ అని పోస్ట్‌ పెట్టారు. బెంగుళూరులోని హరిప్రియ నివాసంలో ఈ నిశ్చితార్థ వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి వశిష్ఠ, హరిప్రియ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్‌మెంట్ వేడుకలో హరిప్రియ పసుపు రంగు చీరలో ముస్తాబు కాగా, వశిష్ట పసుపు రంగు షర్ట్ తో పాటు ధోతిని ధరించాడు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.